ప్రజాస్వామ్య పరిహాసం // కేసీఆర్ దొర సావాసం

తేది: 24 జూలై,2016

వేదిక: మల్లన్నసాగర్ ముంపు గ్రామాలు

సమస్య : 50 TMC సామర్థ్యం తో మల్లన్నసాగర్ అనే రిజర్వాయర్ నిర్మించడం వల్ల 14 గ్రామాలు ముంపుకు గురౌతున్నాయి. తమ గ్రామాలు వదిలిపోము ముంపు తగ్గియ్యమనో, ఇచ్చే పరిహారం సరిపోదనో తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న స్పూర్తితో శాంతియుతంగా భునిర్వాసితులు ఉద్యమం చేస్తురు. ప్రజల గోడు వినాల్సిన ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమతో ముఖ్యమంత్రి అయినా పెద్దాయన వాళ్లకు కనీసం భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారు. భునిర్వాసితుల నిరసనలో భాగంగా హైదరాబాద్-సిద్దిపేట రాజీవ్ రహదారిని ముట్టడించడానికి పునుకొని ఆ వైపుగా నడుస్తున్నారు. నిరసన తెలియజేయడం భారతదేశ రాజ్యాంగం తన పౌరులకిచ్చిన ప్రాథమిక హక్కు. ఎలా వచ్చారో తెల్వదు ఒక్కసారి వందల మంది పోలీసులు నిరసనకారుల చుట్టుముట్టి పిల్లా-జెల్ల, ఆడ-మగ, పెద్దా-చిన్నా తేడాలేకుండా రక్తాలు కారెట్లు, చేతులు వేరిగేట్లు ఆకాశమే హద్దుగా నిరసనకారులు శరీరాల మీద లాఠీలతో చెలరేగారు.మల్లన్నసాగర్ ప్రాంతాన్ని రక్తంతో తడిపారు.100 మందిదాక ఆసుపత్రి పాల్జేశారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి: ఈ రాష్ట్రమేదో ఆయన జాగిరైనట్లు,ఇక్కడ ప్రజాస్వామ్యమే లేనట్లు,రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నిరసనకారులకి కమ్యూనిస్ట్ పార్టీని అంటకడుతూ పోలీసులను భునిర్వాసితులు సూదులు,దప్పునాలు కుచ్చడం వల్లనే లాఠీఛార్జ్ చేసాం అని తండ్రిగా ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి నిర్లజ్జగా,నిస్సిగ్గుగా భరితెగించి అసెంబ్లీలో మాట్లాడిన ఒక్కొక్క మాట 2004 నుంచి తెలంగాణ పేరుచెప్పి వేయించుకున్న ఓట్లకు కన్నీటి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఆయన చెప్పిందే ఆలస్యం ఆయినట్లు తమ తమ స్క్రిప్ట్లతో రెడీ ఉన్న TRS బ్యాచ్ మూకుమ్మడి దాడి భునిర్వాసితుల గుండెలు చించేసింది.

అప్పుడు TRS పార్టీ వాళ్ళకి కాని, దాన్ని జోకే భజన బృందాలకు కాని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వంటి పదాలు గుర్తుకు రాలేదు.

తేది : 12 మార్చ్,2018

వేదిక : తెలంగాణ అసెంబ్లీ

సమస్య : మొన్ననే TS ప్రభుత్వం కొనిచ్చిన 1.7కోట్ల బెంజ్ కార్ ఆనందంలో ఉన్న గవర్నర్, TRS ప్రభుత్వం రాసిచ్చిన అభిరుద్ది గురించి చిన్నప్పుడు బట్టిపట్టిన పాఠం లెక్క ఫాస్ట్ ఫాస్ట్ గా సదువుతుండు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 4000 పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులకు తీవ్ర కష్టాల్లో ఉన్నారనే ఆవేదనలో ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో నిరసన తెల్పుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆయన చేతిలో ఉన్న హెడ్ ఫోన్స్ తీస్కొని గవర్నర్ వైపు విసిరాడు.అది కాస్త అక్కడ గాంధీ బొమ్మకు తగిలి, స్వామి గౌడ్ మీద పడింది అని ప్రత్యక్ష సాక్షుల మాట. అవ్వే నిరసనల మధ్య గవర్నర్ చిన్నప్పటి బడిపిల్లాడు పాఠాలు అప్పజెప్పినట్లు చెప్పి తన కొత్త బెంజ్ కార్ వైపు దూసుకెళ్లాడు ఆయనతో పాటుగా మండలి ఛైర్మన్ స్వామి గౌడ్,ముఖ్యమంత్రి వెళ్లడం కింది వీడియోలో చూడొచ్చు. స్వామి గౌడ్ చాలా నార్మల్ గానే వెళ్లారనే విషయం వీడియో చూస్తే తెలుస్తుంది.

తర్వాత డ్రామా స్టార్ట్ చేసారు, స్వామి గౌడ్ గారి కంటికి దెబ్బతాకినట్లు, సరోజినిదేవి ఆసుపత్రిలో ఒక కట్టుకట్టి, బీసీల మీద అగ్రవర్ణాల దాడి అంటూ తెరాస పెద్దలు సొంత కపిత్వంతో మీడియా అంతా తమేదే కాబట్టి రెచ్చిపోయారు కని ఆ హెడ్ ఫోన్ స్వామిగౌడ్ కంటికి తాకిన వీడియో మాత్రం రిలీజ్ చేయలేకపోయారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి : అసలే మాటల మరాఠీ, నిన్న రాత్రి నుంచి ఇవ్వాళ పొద్దున వరకు TVలల్ల తన పార్టీ చేసిన రచ్చకు అంతా తానై ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, అప్రజాస్వామిక దాడి, అసెంబ్లీ పరువు, అసెంబ్లీ దేవాలయం అని మాటల మాయ చేస్తూ కాంగ్రెస్ సభ్యులను సభనుంచి సస్పెండ్ చేయించాడు. సభలో న్యూట్రల్గా మెలగాల్సిన స్పీకర్, 3 ఏండ్లుగా పెండింగులో ఉన్న పార్టీ ఫిరాయింపుల MLAల మీద చర్యలు తీసుకోకుండా,ముఖ్యమంత్రి ఆదేశమే తడావుగా సస్పెండ్ చెయ్యడం సిగ్గుచేటు.

ఇప్పుడు మాట్లాడిన ప్రజాస్వామ్యం,రాజ్యాంగం మల్లన్నసాగర్, చెర్లగూడెం భునిర్వాసితులను కొట్టించినపుడు ఎటుపోయింది?

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పెద్దలను కాపాడటానికేనా?
సామాన్య ప్రజలకు అవ్వి వర్తించవా??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *