తొమ్మిదో తరగతి చదువుతున్న రశ్మిత, వైష్ణవి తిరగబడితే, కోర్టు కదిలింది, ప్రభుత్వం బెదిరింది

చూడండి. జాగ్రత్తగా చూడండి.

ఆ తలకుమాసిన ఐటీ మంత్రేమో… ఇంతోటి ముఖ్యమంత్రి దొరుకుడు పూర్వజన్మ సుకృతం అంటడు. ప్రపంచం మొత్తం తిరిగి చూస్తున్న తెలంగాణలో… జగిత్యాల జిల్లా కోరుట్ల జెడ్పీ హైస్కూల్ లో కనీస వసతులు లేని దయనీయ స్థితి. తొమ్మిదో తరగతి చదువుతున్న రశ్మిత, వైష్ణవి తిరగబడితే, కోర్టు కదిలింది, తప్పని సరి పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం బెదిరింది.

అరే ఓ బేవకూఫ్ మంత్రీ… తెలంగాణ తెచ్చుకుంది షాదీ ముబారక్ లూ, కళ్యాణ లక్ష్మిల కోసమా? డబుల్ బెడ్ రూమ్ ల కోసమా? అవి ఏ ప్రభుత్వమైనా చెయ్యాల్సినవే, చేస్తున్నవే. మీరు పీకేస్తున్నది ఏమీ లేదు. కోర్టుల జోక్యంతో తప్ప ప్రభుత్వ స్కూలులో వసతులు కల్పించలేని చెత్త ప్రభుత్వం మీది.

సిగ్గులేక మళ్ళీ మాటలు!

చూడండి. జాగ్రత్తగా చూడండి.

ఆ పక్కన మద్యం రేట్లు తెలుసుకునే యాప్ వార్త. ఈ బోడి ఐటీ మంత్రిగానికి ఇంతకు మించిన ప్రయారిటీలు కానొస్తలేవు.

ఎన్ని స్కూళ్ళు మూస్తున్నరు, ఎక్కడ వసతులు లేవు, ఎక్కడ అడ్మిషన్లు లేవు, ఉద్యోగాలు ఎక్కడ ఖాళీలు ఉన్నయి, ఎందుకు భర్తీ ఆయితలేవు, టీఎస్పీఎస్సీ చైర్మన్ పెరిగిన జీతంతో మురుసుడేనా లేక ఉద్యోగాలు ఒస్తలేవని ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల గురించి ఏమనుకుంటున్నడు… ఇసుంటి డేటా, ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ చేసుడు చేతకాదు గానీ… ఓ చెప్తడు కబుర్లు.

ప్రతిపక్షాలను లోఫర్లు, డాఫర్లు అనుడు కాదు. రేపు నువ్వు మంత్రిగా దిగిపోయినంక ఎవడైనా నిన్ను చారానాకు కొంటడేమో సూద్దాం.

చూడండి. జాగ్రత్తగా చూడండి.

రాజకీయం మొత్తం పాడయింది. సమాజం మొత్తం పాడయింది. తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కునేటోడు లేడు అంటూ అస్త్రసన్యాసం చేసే మేధావులూ… జాగ్రత్తగా చూడండి. తొమ్మిదో తరగతి పిల్లలకు ఉన్న తెగింపు లేని మీ డొల్ల మాటలు … ఇక ఆపండి!

చూడండి. జాగ్రత్తగా చూడండి.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు విఫలం అవుతున్నయి. దగాకు గురైతున్నది తెలంగాణ. సింగరేణి, మల్లన్నసాగర్, గోలివాడ, ఎర్రగుంటపల్లె రగులుతున్నవి. ఏరోజు ఈ క్షేత్రస్థాయి సమస్యలపై స్పందించని, కార్యాచరణకు దిగని కాగితపు పులులు కొత్త పార్టీల పేరుతొ గర్జిస్తున్నవి. అవాకులూ చవాకులూ పేలుతున్నవి. ప్రజా శత్రువు కేసీఆర్ ను వదిలేసి, వారిపై తిరగబడుతున్న వారిని తిడుతున్నవి. ఇలాంటి అల్పజీవులపట్ల అప్రమత్తంగా ఉండాలి.

రండి. అతి సమీపంలో ఉన్న అసమానతలు లేని తెలంగాణ లక్ష్యాన్ని చేరుకుందాం. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో అతి త్వరలో రాబోయే కొత్త రాజకీయ పార్టీకి మద్దతు పలకండి.

Srisail Reddy Panjugula
Co-Convener, Praja Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *