ఫీజు వేధింపులే కాకుండా మాదిగొల్లని వేధించడంతోనే సాయి దీప్తి ఆత్మహత్య.

హైదరాబాద్, మల్కాజ్ గిరి లోని Jyothi High School లో 9th Class చదువుతున్న సాయి దీప్తి ని, ఫీజు చెల్లించలేదనె కారణంతో Exam రాయిoచకపోవడమే కాకుండా, మీ మాదిగోళ్ళoత ఇంతే… ఫీజులు కట్టరు కానీ స్కూళ్ళకి ఎందుకు వస్తారు అని తోటి విద్యార్థులoదరి ముందు అవమానించడంతో మానస్తాపానికి గురై ” నన్ను Exam రాయనివలేదు, Sorry Mom” అని రాసి, ఉరేసుకొని చనిపోయింది.

నిన్న ఉదయం News Paper లొ చూసి PDSU విద్యార్థులo వెంటనే ఘటన స్థలానికి వెల్లినం.

పోలీసులు School యాజమాన్యాన్ని కనీసం అరెస్ట్ కూడా చేయకపోవడమే గాక School Building కి, యాజమాన్యానికి కాపలా కాస్తున్నారు…

సాయి దీప్తిది పేద కుటుంభo. కుటుంబానికి న్యాయం చేయండి అని అడిగే దైర్యం లేదు.. దహన కార్యక్రమ సామాగ్రి తెచ్చారు. ఇంకొ 20 నిమిషాలలో అంతా అయిపోయెలా ఉంది. దీప్తి తల్లితో దగ్గరకు వెల్లి, చెల్లిని బైటకి తీసుకుపోదాం, న్యాయం కోసం పోరడుదం అని చెప్పడానికి ధైర్యం చాలకపోయిన… మేము చెప్పాలనుకున్నది వెల్లి చెప్పానూ….
వెంతనే ఆ తల్లి, నేను వస్తా… వెళ్దాం అన్నది.. కాని ఆలస్యం అవుతే Monu (Nick Name) కి రక్తం వస్తదేమొ అని బోరున ఏడ్చింది…
స్థానికులoత ధైర్యం చెప్పారు.

చెల్లి Dead Body ని తీసుకొని రోడ్డు ఎక్కాం. వందల మంది జనాలు వచ్చారు. పోలీసులు అడ్డుకున్నారు.

Sai Deepthi కుటుoభానికి న్యాయం చేయాలి, నిందితులను శిక్షించాలి, యాజమాన్యాo బయటకి రావాలి అనే నినాదాలతో దాదాపు గంట సేపు రోడ్ Block అయింది.
ACP వచ్చారు. మీరు Road మీద గడ్బఢ్ చేస్తే ఏం కాదు.. వాళ్ళ కుటుంబ సభ్యులను వచ్చి ఎం కావాలో అడగమనండి… చేస్తo అన్నారు. వెంటనె ఆ తల్లి ముందుకు వచ్చి, ఎం అడగిందో తెలుసా… “నేను 2000 ఫీజు కట్టాలి, 10,000 కడతాను, నా బిడ్డను నాకు తెచ్చి ఇవ్వండి”, అని అడిగింది…

ACP నోరు మెదపలేదు…
వారికి ఎం చేయాలో అర్ధం కాలేదు..
PDSU విద్యార్థులను అరెస్ట్ చేస్తే వాతావరనం చల్లపడ్తద ఆనుకొని, మమ్మల్ని 6 మందిని Arrest చేసారు. మెం PS లొ ఉన్నాం.

అరెస్ట్ చేసిన 6 మంది విద్యార్థులను తీసుకొస్తేగాని దహన కార్యక్రమం చేయం అని కుటుంభం, స్థానికులు అలానే కూర్చున్నారు… పోలీసులు మమ్మల్ని 6:30 కి విడుదల చేసారు. 7:30 కి దహన కార్యక్రమం జరిగింది….

ఇప్పుడే School యాజమాన్యాన్ని Jail లొ పెట్టారని తెలిసింది.

గుండె బరువెక్కిన తల్లి, శవం తో రోడ్డు ఎక్కితేకానీ నిందితులను Jail లో పెట్టని పోలీస్ యంత్రాంగం..

#ఫీజుల_దోపిడి_రాజ్యమిది
#కుల_వివక్షత_కొనసాగుతున్న_కాలమిది
అనడానికి సజీవ సాక్షమె..
#SAI_DEEPTHI_మరణం.

Post By

సాయిదీప్తికి న్యాయం జరగాలని పోరాడిన PDSU Activist రాసిని పోస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *