గాంధీ ప్రయత్నం చేసుంటే భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దు అయ్యేదా? గాంధీ అడిగిన పోస్ట్ పోన్మెంట్ కి ఒప్పుకోనిబ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ రద్దుకు ఒప్పుకునేవాడా?

గాంధీ ప్రయత్నం చేసుంటే భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దు అయ్యేదా?గాంధీ అడిగిన పోస్ట్ పోన్మెంట్ కి ఒప్పుకోనిబ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ రద్దుకు ఒప్పుకునేవాడా?–చరిత్ర
—————————
1920 లో మొట్టమొదటి సారి భారతదేశంలో ఎన్నికలునిర్వహించిన్రు..దీని ప్రకారం ప్రోవిన్షల్ అస్సెంబ్లీస్ (నేటిరాష్ట్రాల లాగ) లో డైయార్కి ప్రభుత్వాలుఎర్పడ్డై.విద్య,వైద్యం,వ్యవసాయం,పంచాయితి రాజ్భారతీయుల చేతిలో ఉండగ కీలకమైనపోలిస్,రెవెన్యూ,లా అండ్ ఆర్డర్ బ్రిటిష్ వారి చేతిలోఉండే.పదేళ్ల తరువాత మళ్ళీ సమీక్షిస్తం అన్న బ్రిటిష్..స్వాతంత్ర కాంక్ష చూసి 8 ఎండ్లకే (1928) సైమన్కమీషన్ ఎర్పాటు చేసింది. అందులో ఒక సభ్యుడైనక్లెమేంట్ ఏట్లీ 1934 వరకు భారత్ స్వాతంత్రం కు కమ్మిట్అయిండు. సైమన్ కమ్మిషన్లో భారతీయ సభ్యులులేకపోవటంతో కాంగ్రెస్ దాన్ని బాయ్‌కాట్ చేసింది.1928 అక్టోబర్ 30న లాల లజ్‌పత్ రాయి నేత్రుత్వంలో నిరసనకార్యక్రమం జరిగినప్పుడు అక్కడి ఎస్ పి స్కాట్ లజ్పత్రాయిని కొట్టడంతో రెండు వారాల తర్వాత మ్రుతిచెందడం జరిగింది. హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీదీనికి ప్రతీకారంగ చంద్రశేఖర్ అజాద్ నేత్రుత్వంలో భగత్‌సింగ్ , సుఖ్‌దేవ్, రాజ్ గురు ఏ ఎస్ పి సాండర్స్ నిడిసెంబర్ 17న షూట్ చేసి చంపడం జరిగింది. తరువాత1929 ఏప్రిల్ 8న హెచ్ ఎస్ అర్ ఏ లక్ష్యాలు ప్రజలకుతెలియజేయాలంటే సెంట్రల్ లెగిస్లేటివ్ అస్సెంబ్లీలోబాంబ్ విసరాలని నిర్ణయించిన్రు.ఇది భగత్ సింగ్ ప్లాన్..మిగితా సబ్యులు భగత్ సింగ్ ని మీరు వద్దు వేరేవాళ్ళతో ఈ పని చేపిద్దాం అని వారించినా .. భగత్ సింగ్నేనే వెళ్తా అని చెప్పడం జరిగింది. బాంబ్ విసరడంఉద్దేశం ఎవరినో చంపాలని కాదు..ప్రజల్లో చర్చ లేవనెత్తివిప్లవం వైపు ప్రజలను మళ్ళించే ఉద్దేశం.భగత్ సింగ్ నిఅర్రెస్ట్ చెయ్యటం, విచారణలో పాత ఏ ఎస్ పి సాండర్స్కేస్ తోడి ఉరిశిక్ష విదించడం జరిగింది.
ఉరిశిక్ష తేది దెగ్గరకొచ్చే సరికి భారతీయులంత ఉరిశిక్షనురద్దు చెయ్యమని వైస్రాయ్ ఇర్విన్ ను కోరడంజరిగింది.భారత దేశానికి స్వాతంత్రం కోసం మార్చ్ 5 1931 న జర్గిన చర్చల్లో గాంధీ ఇర్విన్‌ను శిక్ష పోస్ట్పోన్చెయ్యమని అభ్యర్ధించడం జరిగింది.మార్చ్19న గాంధీఇర్విన్ ని మళ్ళి కలిసి శిక్షను పోస్ట్ పోన్ చెయ్యమనిఅభ్యర్ధించడం జరిగింది. 23 పొద్దున కూడ ఇర్విన్ కుశిక్షను పోస్ట్‌పోన్ చెయ్యమని లేఖ రాయడం జరిగింది…ఆలేఖ చదివితే గాంధీ ఎంత భాదతో రాసిన్రోఅర్ధమైతది..సాయంత్రం భగత్ సింగ్ ను,సుఖ్ దేవ్‌ను,రాజ్ గురును ఉరివెయ్యడం జరిగింది.
మార్చ్ 29న కరాచీలో ప్రతి యాడాది జరిగేకాంగ్రెస్ సెషన్లో భగత్ సింగ్ ను కాపాడలేకపోయిన్రు అనినిరసన తెలిపిన్రు సభ్యులు.వల్లభాయ్ పటేల్ నుఘోరావ్ చేసిన్రు .కాంగ్రెస్ “ఈ ముగ్గురి ఉరిశిక్ష పగతోచేసిన్రు..స్వాతంత్రం అడుగుతున్నందుకు” అని తీర్మానంచేసింది. తీర్మానం ప్రవేశపెట్టమని గాంధీ నెహ్రూ కిచెప్పడం జరిగింది.
గాంధీ సెక్రీటరి మహాదేవ్ దేశాయి.. వార్త తెల్వంగనే గాంధీబాధతో ..”నన్ను నేను సమర్ధించుకోటానికి చెప్పట్లే. నేనుచెయ్యగల్గిందంత చేసిన..నా మనస్సంత పెట్టిఅడిగిన..అని కుంగిపోయిన్రు ” అని తన సంతాపసందేశంలో అనటం జరిగింది.
సుభాష్ చంద్ర బోస్ కూడా గాంధీ చెయ్యగల్గింతా చేసిన్రుఅని తన సందేశంలో చెప్పటం జరిగింది.
భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్ “నన్ను బాదపడకు..ఉరివెయ్యని.కాని మీరందరు మన నాయకుడు గాంధీకి,కాంగ్రెస్ నేతలకు మద్దతుగ నిలవాలి ..అప్పుడే మనదేశానికి స్వాతంత్రం వస్తది ” అని చెప్పిండు అని తనమాటల్లో చెప్పడం జరిగింది. ప్రాంగనం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది.
ఉరిశిక్షకు ముందు భగత్ సింగ్ నెహ్రూ ,సుభాష్ చంద్రబోసు అడుగుజాడల్లో స్వాతంత్రం కోసం పంజాబ్యువకులు నడవాలి అని రాయటం జరిగింది.
భగత్ సింగ్,లాలా లజ్‌పత్ రాయి,అజాద్,సుఖ్ దేవ్ ,రాజ్‌గురు,గాంధీ,పటేల్,నెహ్రూ ,బోస్ అందరు భరతమాతముద్దు బిడ్డలే.

** కొంత మంది మిత్రులు గాంధీ అనుకుంటే భగత్ సింగ్బ్రతికేవారు అనటంతో ఈ వ్యాసం ద్వారా ప్రజలకువాస్తవాలు తెలియజెప్పే చిన్న ప్రయత్నం ఇది.
— స్రావంత్ పోరెడ్డి (SPR)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *