86 కోట్ల బ్యాంక్ లోన్ ఎగ్గొట్టిన మంత్రి జూపల్లి కొడుకుల అవినీతి భాగోతం

బ్యాంకులను ముంచడం చాలా సులభం. ఒక రాజకీయ నాయకుడి అండవుంటే చాలు, బ్యాంకులకు ఈజీగా టోకరా వేయవచ్చు. బ్యాంకోళ్లు కూడా రాజకీయ నాయకుడి పేరు చెబితే చాలు, ముందు వెనక చూడ కుండా కోట్లకు కోట్లు లోన్ ఇచ్చేస్తారు. ఈ లోన్ తీర్చగలడా లేదా అనే అనుమానం లేకుండా బ్యాంకుల వాళ్లు లోన్లు అందిస్తారు. తాకట్టు పెట్టిన ఆస్తుల విలువ లోన్ కంటే చాలా తక్కువగా ఉన్నా మంత్రి తాలూకు మనిషయితే చాలు కోట్ల కోట్లకు లోన్లీస్తారు. విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీల సంగతలా ఉంచితే, తెలంగాణలో కూడా ఇలాంటి మోసమే జరిగింది.

మునిగింది స్టేట్ బ్యంక్, ముంచింది తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణా రావు కొడుకులు.

ఇపుడు కొడుకులు బ్యాంక్ లోన్ కట్టడం లేదు. లోన్ కోసం ప్లెడ్జ్ చేసిన ఆస్తులు కొనేందుకు ఒక్కడూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే, అవి TRS మంత్రిగారి కొడుకు అస్తులు. ఎవడైనా ముందుకొస్తే ఏమవుతుందోననే భయం.

అసలు జరిగిందేమంటే…

టిఆర్ఎస్ మంత్రి జూపల్లి కృష్ణరావుకు ఇద్దరు కొడుకులు: జూపల్లి అరుణ్, జూపల్లి వరుణ్. తండ్రి రాజకీయనాయకుడు, పలుకుబడిని పెట్టుబడి గా మార్చాలనుకున్నారు. అందుకే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. దానికి శైలిపారాడైమ్ ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని అందమయిన పేరు పెట్టారు. ఇందులో వీరికి వాసిరెడ్డి కిరణ్ రెడ్డి అనే మూడో వ్యక్తి కూడా తోడయ్యాడు. అరుణ్ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్. తెలంగాణాలో కట్టే నీటిపారుదల, రోడ్ ప్రాజక్టులకు సేవలందించేందుకు ఈ కంపెనీని పెట్టారు. తమ ఆస్తులు చూపించి, స్టేట్ బ్యాంక్ నుంచి రు. అరవైకోట్ల లోన్ తీసుకున్నారు. ఇందులో కిస్మత్ పూర్ లో నాలుగెకరాల భూమి, రాజేంద్ర నగర్ లోని గగన్ పహాడ్ ఏరియాలో మూడెకరాల భూములు, అమీర్ పేట్ లోని రాయల్ పెవిలయన్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో మూడు ఫ్లాట్స్ తాకట్టుపెట్టారు. 2013 లో లోన్ తీసుకున్నారు. ఒక్క పైసా కట్ట లేదు. 2017 డిసెంబర్ నాటికి లోన్ మొత్తం రు.86 కోట్లయింది.

అయితే, ఈ మధ్యల్ ఏంజరిగిందో తెలుసా, అరుణ్ , వరుణ్ లు కంపెనీని 2014లో క్రిద్యా ఇన్ ఫ్రా లిమిటెడ్ అనే అనే లిస్టెడ్ కంపెనీకి అమ్మేశారు. లోన్ కు మాత్రం తామే గ్యారంటీ అని బ్యాంక్ కు నచ్చ చెప్పారు. అంతే, అంతకు మించి బ్యాంకుకు వచ్చినదేమీ లేదు. క్రిద్యా కట్ట లేదు. ఈ లోపు తెలంగాణ వచ్చింది. తండ్రి జూపల్లి కృష్ణారావు మంత్రి అయ్యాడు. ఇక కొడుకులు లోన్ గురించి యోచించనే లేదు. చివరకు ఇది స్టేట్ బ్యాంక్ మొండి బాకీ అయింది. బ్యాంకు వాళ్లకు నోటీసులు ఇచ్చింది, జవాబు లేదు. ప్రాపర్టీ వేలం వేస్తామని కూడా నోటీ సులిచ్చింది. ఈ ఆస్తులను అమ్మితే కనీసం సగం డబ్బులయినా వస్తాయని బ్యాంకు ఆశ. ఆక్షన్ కు పెద్దగా స్పందన లేదు. వచ్చిన వాళ్లు ఆస్తుల డాక్యమెంట్సు చూడాలని పట్టు బట్టారు. తీరా పరిశీలిస్తే, కొన్ని భూముల అప్పటికే వివాదాల్లో ఉన్నాయి. వివాదాల్లో వుండటం, TRS మంత్రి జూపల్లి కుమారులు వోనర్లు కావడంతో వేలంలో పాట పాడి ఆస్తులు కైవసం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

ఇపుడు బ్యాంకు వాళ్లు డైరెక్టు గా ఏమీ చేయలేకపోతున్నారు. దీనికి కారణం బ్యాంకు రుణం ఎగ్గొట్టిన వాళ్లు రూలింగ్ పార్టీ మంత్రి, అందునా జూపల్లి కృష్ణారావు కొడుకులు కావడం. ఇక గత్యంతరం లేక స్టేట్ బ్యాంక్ వాళ్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వెళ్లాలనుకుంటున్నారని SBI అధరైజ్డ్ ఆఫీసర్ టి ఆజయ్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.

Source : Times of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *