సంచలనం రేపుతున్న పవన్ అభిమాని లేఖ

గౌరవనీయులైన జనసేన పార్టీ అద్యక్షులు
పవన్ కల్యాణ్ గారికి నమస్కారం

అన్నా…నా పేరు రాజు గౌడు ,మెదక్ జిల్లా నేను నీకు వీరాభిమానిని నా ఇంటిలో కూడా దేవుడి పక్కన నీ పోటో వుంటుంది నువ్వు రాజకీయ పార్టీ పెట్టిన తరువాత చాలా సంతోషపడ్డా నా దగ్గర డబ్బులు లేకపోయినా ఆరోజు అప్పు చేసి మరీ నా స్నేహితులు బందువులు ఊరు వాళ్ళకు అందరికీ స్వీట్స్ కోని పెట్టాను ఊరులో నా ఇంటిమీద జనసేన జండా ఎగరేసారు ఇప్పటివరకూ అలానే వుంది కానీ..ఈ రోజు మాత్రం ఆ జండా తీసెస్తున్నాను అన్నా..అవమానాలు బరించలేకపోతున్నా… ప్రతి ఒక్కరూ అడుగు తున్నారు మీ నాయకుడు “ఎవరికి ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు” అని నా దగ్గర సమీదానం లేదు అన్నా…

నీవు పార్టీ పెట్టిన రోజు పోటీ చేయకుండా ప్రశ్నిస్తా అంటే ప్రజలతరుపున నిల్చోని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావు అనుకున్నా…కానీ ఈ రోజు కోన్ని వందలు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను ప్రశ్నించటం మానేసి ఓటమి చెందిన ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నిస్తున్నావు ఏంటన్నా…ప్రతిపక్ష పార్టీ లను ప్రశ్నిస్తే ఏం వస్తుంది అన్నా..ప్రజలకు ఏం ఉపమోగం అన్నా…వారు ఏమైనా అధికారంలో వున్నారా హమీలు నెరవేర్చడానికి..?

ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే జనసేన పార్టీ ఎవరిని ప్రశ్నించడానికి పెట్టావు అన్నా..?
ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక్క మీటింగ్ పెడితే ప్రజాసమస్యలు పై పోరాడినట్టు కాదన్నా..నిరంతరం ప్రజల మద్యలో వుండి ప్రజా గోంతు రాష్ట్ర ప్రభుత్వాలకు వినబడేలా పోరాడితే ప్రజలకోసం పోరాడినట్టు అన్నా..

కేసిఆర్ ప్రభుత్వం పై ప్రజలు విసిగి పోయారు అన్న ఈ ప్రభుత్వం చేసిన మోసాలు అరాచకాలు చిన్న పిల్లాడికి అడిగినా కూడా చెబుతాడు..కానీ అదే కేసిఆర్ మీ వలన అధికారంలోకి వచ్చారు..కోన్ని వందల హమీలు నెరవేర్చకపోతున్నా కేసిఆర్ గారిని కనీసం ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కసారి కూడా మీరు ప్రశ్నించలేదు..కనీసం ఒక్కౌమాట కూడా అనటం లేదు ఏంటో నాకు అర్దం కావడం లేదు మీ రాజకీయం..!

ఇకనుంచి సినిమా పరంగా మీ అభిమానినే కానీ రాజకీయంగా కాదు..! ఇకపై నా ఇంటి పైన జనసేన పార్టీ జెండా కానీ నా చేతితో జండా పట్టుకోవడం కానీ జై కోట్టడం చేయను..జనసేన పార్టీకి ఓటు వేయడం జరగదు ఇక సెలవ్…
జై హింద్…

మీ వీరాభిమాని
రాజు గౌడు,
కోత్తపల్లి,మెదక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *