KCR సింగరేణి హామీల గూర్చి నల్ల సూరీలు ఏమనుకుంటున్నారో వినండి

మల్లన్న : ఏం రాజన్న 27 న కేసిఆర్ సభ పెడుతున్నారు అని బాయిలు బంద్ అంట కదా.. మరీ సభ కి వచ్చిన కార్మికులకు తీపి వార్త చెప్పుతండవా?

రాజన్న : అబ్బో ఆ సార్ తీపి వార్తలు ఇచ్చి ఇచ్చి నాకు షుగర్ వ్యాధి వచ్చింది మల్లన్న..

మల్లన్న :గట్లంటవేందే కారుణ్య నియమాకల గురించి ఏదో చెప్తరని అంటున్నారు..

రాజన్న : అయ్యో పిచ్చి మల్లన్న..ఏట్లా చెప్తరని అనుకుంటున్నవు… ఏడాదో, రెండోళ్ళో సర్వీస్ నిభంధన పెట్టి కారుణ్య నియమాకలు ఇస్తున్నామని చెప్తే నీయసంటి తక్కువ సర్వీస్ ఉన్న కార్మికులు ఊరుకుంటారనే.. చెప్పులు ఇసురేయరు..దీపావళి కి ఇస్తా అని చెప్పి 5 నెలల తర్వాత వచ్చి సర్వీస్ నిభంధన పెట్టి ఇస్తారా అని దుమ్మేత్తి పోయారా… అందుకే వచ్చి అది ఇది అని చెప్పి కారుణ్య నియమాకల సర్క్యూలర్, విధి విధానాలు ఈ రెండు, మూడు రోజుల్లో అని పోతాడు…

మల్లన్న : అవునే రాజన్న నువు చెప్పేది అయితే నిజం..ఇగ ఆ మాత్రానికి ఇడిదాక వచ్చి బాయిలు బంద్ పెట్టి సభ పెట్టడం ఏందుకు? మరీ నువ్వు పోవానే సభకి..

రాజన్న : అడికి పోయిన సంబరపడే ముచ్చట్లు ఏం ఉండవు..ఏన్ని చూడలే సార్ మీటింగ్ లు.. మాటలతో స్వర్గం చూపిస్తడు..విని విని చూసి చూసి ఓపిక, అశ రెండు నశించాయి…పోయిన ఏడాదే కరెక్ట్ గా ఇస్తే ఈ ఏడాది మన పోరగాళ్ళు నౌకర్లో ఎక్కుతుండే… నాది ఇగ మూడు నెలలు ఉంది సర్వీస్.. నా బిడ్డ లగ్గం చేసి అల్లునికి నౌకరి రాయించిన.. నౌకరి రాకపాయే ఉన్న ఒక్క బిడ్డ గోస చూడలేక చస్తున్న.. ఆగం చేసిండ్రు…మనోసంటి తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళని పక్కన పెడుతారు.. ఇక ఆడికి పోయి ఏం చేద్దాం..బుక్కేడు తిని ఆ చూసేదేదో ఇంట్ల కూసేనే ఛూద్దాం.. ఆ ఏండల నెరివడటం తప్ప.
ఇస్తే అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ కి ఉద్యోగాలు ఇవ్వాలి…….

మల్లన్న : మంచిగా చెప్పినవే రాజన్న..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *