‘చార్మింగ్’ లీడర్ రాహుల్ గాంధీకి నచ్చిన “CHARMS” అప్లికేషన్

AICC అధ్యక్ష్యులు రాహుల్ గాంధీ రెండు రోజుల నగర పర్యటనలో భాగంగా తెలంగాణా రాష్ట్ర “IT CELL” ప్రెసిడెంట్ మదన్ మోహన్ రావుకు కేటాయించిన సమయం పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని నెలకొల్పింది, పార్టీలోని సీనియర్ మోస్ట్ నాయకులకు సైతం దొరకని ఈ అవకాశం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనం..

ఈ భేటీలో మదన్ మోహన్ రావు బృందం రూపొందించిన “CHARMS” అప్లికేషన్ ఫై చర్చ జరిగింది, CHARMS అనగా “Congress Human Resource Management System”.. పార్టీ కార్యకర్తల స్థాయి నుండి AICC అధ్యక్ష్యుని వరకూ కమిటీ స్థాయి నాయకులనుండి జాతీయ స్థాయి , మంత్రివర్గ స్థాయి నాయకుల వరకూ ప్రతీ ఒక్కరితో నేరుగా మాట్లాడి సమాచార మార్పిడి చేసుకునే వ్యవస్థే CHARMS గా రూపొందబడిన ఈ అప్లికేషన్..  ఈ సిస్టమ్ పూర్తిగా కృత్రిమ మేధస్సు తో పనిచేస్తుందని తెలిపారు.

 

ఈ అప్లికేషన్ ద్వారా గ్రామ స్థాయి కార్యవర్గంతో AICC అధ్యక్ష్యులు ఎప్పుడైనా నేరుగా సమస్యలపై మాట్లాడవచ్చు, దీని ద్వారా వివిధ సామాజిక వర్గాల సమస్యలపై సత్వర సమాచారం, తెలుసుకోవచ్చు త్వరితగతిన స్పందించవచ్చు, ఏకకాలంలో పరిష్కారం దిశగా చర్యలు చేపట్టవచ్చు… ఈ వ్యవస్థను వెనువెంటనే అమలు పరచే యోచనలో AICC అధ్యక్ష్యులు ఉన్నట్లు విశ్వసనీయ సమాహారం, ఇదే కనుక జరిగితే ఇక కాంగ్రెస్ పార్టీతో ప్రజల అనుబంధం మరింత పటిష్టం అయినట్లే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *