తెలంగాణలో కోదండరామ్ కొత్త పార్టీ

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకానుంది. తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదాండరామ్ ప్రకటించారు.

కొంతకాలంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ జెఎసి కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ఆచరణ రూపంలోకి వస్తోంది.ఆదివారం నాడు తెలంగాణ జెఎసి విస్తృతస్థాయి సమావేశం హైద్రాబాద్ సమీపంలోని ఓ ఫంక్షన్ హల్ లో జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ ఏర్పాటు అవసరమని ప్రజలు కోరుకొంటున్నారని రాజకీయ జెఎసి చైర్మెన్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ పెట్టాలని ఆలోచనకు వచ్చినట్టు టిజెఎసి చైర్మెన్ కోదండరామ్ ప్రకటించారు. గ్రామాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు బతకలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.రైతుల కోసం పెద్ద పోరాటమే చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టాలని ప్రజలంతా కోరుతున్నారని, అది లేకపోతే తమ పోరాటానికి ఫలితం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని, రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ పెడుతున్నట్లు తెలిపారు.

త్వరలో పార్టీ పేరును ప్రకటిస్తామని చెప్పారు. డబ్బున్నవారే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆరోపించారు. ప్రజల సహకారంతోనే పార్టీ నడపాలి అని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీతో పాటు ఐకాస కూడా నడుస్తుందని కోదండరాం స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *