ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి నేడు ప్రజలను తప్పు దోవ పటిస్తున్న కెసిఆర్

తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 4 ఏళ్ళు గడిచిన… అధికార పార్టీ తెరాస తమ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన ఒక వాగ్దానం కూడా సరిగా ఆచరణలో తేలేదు, ముఖ్య మంత్రి KCR ఎన్నికల బహిరంగ సభలలో అనేక వాగ్దానాలు, ఆచరణాలలో సాధ్యం కానీ వాటిని చెప్పి, ప్రజల అమాయకత్వంతో… వారికీ లేని ఆస ను కల్పించారు. తెరాస ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో అమరుల ఆశయాలే తమ పార్టీ సిద్ధాంతము అని ప్రజలను నమ్మబలికి అధికారం చేతికి వచ్చిన తరవాత ఆంధ్ర పాలకుల కంటే దారుణంగా తెలంగాణ ప్రాంత ప్రజలను దోచుకుంటున్నారు…
.
నీళ్లు, నిధులు,నియామకాలు అనే మూడు సిద్ధాంతాల మీద తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదటి తొలి దశ నుండి చివరి వరకు ఆవే సిద్ధాంతాలతో తెలంగాణ 29 వ రాష్ట్రము గా భారత దేశ చరిత్ర లో ఎక్కినది, ఈ మూడు సిద్ధాంతాలే కాకుండా, మరో కొన్ని మోసపూరిత పథకాలు ఎన్నికల ప్రణాళికలో పెట్టి జనాలను తనే తెలంగాణ తీసుకోని వచ్చిన విధంగా ప్రజలకి చూపించుకొన్నాడు మోసకారి అరాచక అబద్దాల KCR.
.
నిజానికి తెలంగాణ 1200 అమర విద్యార్ధి నాయకుల త్యాగ ఫలితం… కానీ, నేడు ఆ ఆణిముత్యాలను ఈ “KCR కుటుంబ దొర” ప్రభుత్వం వారి త్యాగాలను గుర్తించలేదు, వారే కానీ నేడు ఈ నూతన రాష్ట్రము లో బతికి ఉంటె ఈ నిరంకుశ పాలనా చూసి ఈ దొర ప్రభుత్వాన్ని ఎన్నడో గోరి కట్టి ఉండేవారు.
.
నా తెలంగాణం ఈ పాలనా చూసి… ఇందుకా నా యువ విద్యార్థి నాయకులూ వారి ప్రాణ త్యాగం చేసింది అని, బిక్కు బిక్కు అని కన్నీళ్లు కరుస్తుంది.
నా అమర ఆణిముత్యాల పాపమూ తాకి ఈ ఆంధ్ర దొర పాలనా అతి త్వరలో అంతం కానుంది…
..
జై తెలంగాణ!!! జోహార్ మన విద్యార్థి అమరులకు .
రాసిన వారు అశోక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *