రాజ్ నాథ్ సింగ్ సీఎం కేసీఆర్ ను ఆవమానించడా…..?

భారత గృహ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ,సీఎం కేసీఆర్ ను ఆవమానించడాని కొందరు తెగ బాధపడిపోతున్నారు. కాలుమీద కాలేసుకొని కూర్చోవడం అవమానమంట. సంస్కరం లేదంట.

ఇగ మన సారు సంస్కారాలు , బీజేపీ నాయకుల సంస్కారాలకు మధ్య తేడా చెప్తా చూడుర్రి.

◆బీజేపీ నాయకులు, ఎవరినైనా “వారు” వీరు, మీరు అని సంబోధిస్తారు.
◆మరి కేసీఆర్ ఎట్లా అంటాడో తెలుసుకదా. వాడు, వీడు, వాడేం పీకుతాడు, గడ్డి పీకిర్ర, దిమాక్ లేదు, సన్నాసులు, దద్దమ్మలు, దరిద్రపుగోటోళ్లు. ఇలా #సంస్కార వంతంగా పిలుస్తాడు. ఇగ రాజనాథ్ సింగ్ ఈ మాటలు నేర్చుకోవాలి…??.
◆బీజేపీ ;- రావు జి, అని మోడీ ప్రేమగా పిలుస్తారు. ఈ ముక్క కేసీఆర్ కూడా చెప్పిండు
◆ కేసీఆర్ ;- మోడీ గా___ అని LIVE లో తిట్టి, కొడుకు, బిడ్డే టంగ్ స్లిప్ అయిందని నిర్మల సీతారామన్ కు క్షమాపణ చెప్పాక, మూడురోజులకు మల్లచ్చి #నేను_అనలేదు నా మాటలు వక్రీకరించారు అని ( LIVE ) మీడియా కవరెజి జమానాలో వక్రీకరణ చేస్తారా.. జనాలను హౌలే గాళ్ళు అనుకున్నాడేమో?
■ఇంకొన్ని అణిముత్యాలు.
సాటి మంత్రి, దళిత నాయకుడు, ఉపముఖ్యమంత్రి T రాజయ్యను నిండు సభలో ఏ రకంగా అవమానించాడో, ఏకంగా కనీసం సమాచారం లేకుండా, సంజాయిషీ లేకుండా డిప్యూటీ సీఎం పదవినుంచి తొలగించాడో దేశమేరిగిన సత్యం.

ఇహపోతే సభల్లో, జనాలను ఎలా బెదిరిస్తాడో చూడని విషయమా..?
ఏందివా నీళ్లొల్లి, నాకంటే ఎక్కువ తెలుస్తాదా?? ఆంధ్రోడివా..? సన్నాసులు పార్టీ వాడివా ఇలా సాగుతాయి మాటలు. జనాల ఓట్లతో గెలిచి, జనాలనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డం. ఒక సీఎం గా ఉండి ఎలా ప్రవర్తించాలి అని తెలియకుండా ప్రవర్తించడం. ఉద్యమంలో అంటే నడిచిపోయింది. సీఎం అయ్యాక కూడా అదే ధోరణి.
చెప్పుకుంటూ పోతే దునియా ఉన్నయ్.

ఇవన్నీ చూస్తే ఒక శాత్రం గుర్తుకువస్తుంది.

◆ అష్టవంకర్లు ఉన్నోడు………………..అన్నాడట.

● #గమనిక ;-ఇక్కడ ఇటుక దెబ్బకు, రాయి దెబ్బతో సమాధానము లభించును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *