రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పై ఓ ఆంధ్రా సెటిలర్ అంతరంగం – ప్రతీ తెలుగు వాడు చదువాలి

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ హైదరాబాదు నగరానికి ఈనెల 14 వతేదీన విచ్ఛేస్తున్న సందర్భంగా తెలంగాణా రాష్ట్రంలో, ఉమ్మడి రాజధాని హైదరాబాదు నగరంలో నివసించే ఆంధ్రా సోదరసోదరీమణులకు హైదరాబాదులో గత 30 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఒక తెలుగువాడు, ఒక ఆంధ్రుడు చేస్తున్న విజ్ఞప్తి.🙏🌸.
మనం ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని జనాభాలో ఆంధ్రులము మూడోవంతు మందిమి అనగా షుమారు కోటిమందిమి ఉన్నాము. గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ మనం ఎదుర్కొంటున్న అవమానాలు అవహేళనలు బెదిరింపులు ఏమిటో మనకందరికీ తెలుసు.
రాష్ట్ర విభజన జరిగినాక కూడా నేటికీ మన మీద మన ఆస్తుల మీద జరుగుచున్న ఆక్రమణలు దాడులు, మనపట్ల ఇక్కడ ముఖ్యంగా పోలీసులు ప్రదర్శిస్తున్న వివక్షత, బెదిరింపులు మనకు తెలిసిందే.
ఇక్కడ గత నాలుగేళ్లుగా ప్రస్తుతం మనం ఉమ్మడి రాజధానిలో కూడా ఎటువంటి మానవహక్కులు, పౌరహక్కులు, రాజ్యాంగహక్కులు లేనటువంటి ద్వితీయశ్రేణి పౌరులుగా ప్రతి ఒక్కడికి భయపడుతూ వివక్షతకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సివస్తోంది.

దీన్ని అరికట్టాలంటే మనం కూడా గౌరవమర్యాదలతో రాజ్యాంగహక్కులతో రక్షణగా ఇక్కడ బ్రతకాలంటే మనకు కూడా సముచిత రాజ్యాధికారం ఉండి తీరాలి. మనం అందరమూ సమీకృతమై తలచుకుంటే తెలంగాణాలో మూడోవంతు అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పొందవచ్చుఁ. ఇలా రాజ్యాధికారం పొందగలిగితేనే మనకు రక్షణ గౌరవమర్యాదలు ఉంటాయి.
తెరాసలో మనకు రక్షణ గౌరవమర్యాదలు ఉంటాయి అని అనుకోవడం మన భ్రమ మాత్రమే అవుతుంది. వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద నడచి ఈపార్టీ ఎప్పటికీ మనల్ని అంటారానివారిగానే చూస్తుంది. కాబట్టి ఈపార్టీతో మనం ప్రయాణిస్తే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.

మనకు సరైన ప్రాతినిధ్యం గుర్తింపు గౌరవ మర్యాదలు ఇచ్ఛే పార్టీలను, ముఖ్యంగా జాతీయపార్టీలను మనం ఆదరించడం మనకు మన భవిష్యత్తుకు ఉత్తమం.
మనకు ఇప్పుడు కళ్ళముందు రెండు జాతీయపార్టీలు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.
1. కాంగ్రెస్.
2. బీజేపీ.
బీజేపీ ఇంతవరకు మనల్ని గుర్తించి గౌరవించే ప్రయత్నం ఏమాత్రమూ చేయలేదు, మనం బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మనల్ని దరిచేర్చుకునే ప్రయత్నమే చేయలేదు.
కాంగ్రెస్ తాను చేసిన పొరపాటు సరిచేసుకుని మనల్ని గుర్తించి గౌరవిస్తాము రక్షణ ఇస్తాము అంటూ బహిరంగంగానే పిలుపునిచ్చింది. కాబట్టి మనం ఒకసారి ఆపార్టీని నమ్మడంలో తప్పులేదు. ఒకసారి నమ్మితేనే కదా తెలిసేది ఏదైనా !
మనకు ఎప్పటికైనా జాతీయపార్టీ అండగా ఉంటే మనకు మన మానప్రాణాలకు ఆస్తులకు అత్యంత భద్రత భరోసా ఉంటుంది అని ఖాయంగా చెప్పవచ్చుఁ. లేకపోతే,

ఇప్పటి తెరాస శ్రేణులు నగరం చుట్టుప్రక్కల చాలాచోట్ల పోలీసుల సహకారంతో రాజకీయనాయకుల అండదండలతో మనమీద కొనసాగిస్తున్న దాష్టీకాలు అనేకం. వీటిని అడ్డుకోవాలంటే, మరలా తెలుగుదేశంపార్టీ లాంటిది కూడా ఇక్కడ వేళ్లూనుకోవాలి అంటే మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆ పార్టీకి మనం అండదండలు ఇస్తే మనకు ఒక భద్రత ఉంటుంది అని నా మనవి.
కాబట్టి, ఈనెల 14వ తేదీన హైదరాబాదులో జరుగుచున్నటువంటి కాంగ్రెసుపార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ సభలకు సంఘీభావం మద్దత్తు ప్రకటించి మనం మన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటే బాగుంటుంది.
విజ్ఞులు మేధావులు చైతన్యవంతులైన హైదరాబాదు నగరంలోని ఆంధ్రా సోదరసోదరీమణులు అందరూ ఒకసారి ఆలోచించమని మనవి విజ్ఞప్తి.
భవదీయుడు.
హైదరాబాదులోని ఒక ఆంధ్రుడు.

గమనిక:
ఇక్కడి కొంతమంది మీడియా వ్యక్తులు మనల్ని సీమాంధ్రులు అంటూ మన మధ్య మరో విభజన చేయాలని చూస్తున్నారు, దీనిని మనం అడ్డుకోవాలి.

One thought on “రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పై ఓ ఆంధ్రా సెటిలర్ అంతరంగం – ప్రతీ తెలుగు వాడు చదువాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *