తెల్శినోనికి తెల్కపిండి తెల్వనోనికి గానుగపిండి అన్నట్టుంటయి మన కేసీఆర్ ముచ్చట్లు

మా ఊళ్లే ఓ తాతకు కోళ్లఫారం ఉంది. ప్రతి దసరా పండక్కి ఓ కోళ్ల బ్యాచ్ ఒచ్చేటట్లు కోడిపిల్లల్ని ఏసేటోడు. ఊరంతా దసరా పండగ రోజు గాన్నే కోళ్లు కొనుక్కునేటోళ్లు. ఓ ఏడు తాత గ్యాసారం బాగాలేక దసరా పండగ 2 రోజుల ముందు గట్టిగా వాన పడి కోళ్లఫారం సగం కూలిపోయింది. దానివల్ల సగం కోళ్లు సచ్చిపోయినై. దసరా నాడు కోళ్లు కొందామని పోతే నూరుకు అమ్మాల్సిన కోడి ₹200 అన్నాడు. గదేంది తాత ₹100 నే కదా ₹200 అమ్ముతున్నావంటే ప్రతి దసరాకి 1000 కోళ్ల దాకా అమ్మేటోన్ని కని నా దగ్గర 500 ఉన్నాయి అందుకే ఇప్పుడు ₹200 ఒకటి అమ్ముతున్నా అన్నాడు. ఎం చేస్తాం ముసలోనికి నష్టం వచ్చింది, గట్లే గిరాకీ కూడా పెరిగిందని ఆయన చెప్పిన ధరకి కోళ్లను కొనక్కపోయారు ఊరంతా….

ఇప్పుడు గదంతా ఎందుకు చెప్తున్నా అనే కదా మీ సందేహం. గదే చెప్తున్నా

అమెరికాల హర్రీకెన్లు 2-3 సార్లోచ్చి పత్తి అధికంగా పండే ప్రాంతాలన్నీ నీళ్ల కొట్టుకపోయినై. మనదగ్గర కూడా అదేదో #అడ్డమైన #గులాభిరంగు_పురుగు సోకి, కల్తీ విత్తనాల వల్ల దిగుబడి చాలా తగ్గిపోయింది. గిసొంటి సమయం ల పత్తి ధర అంతర్జాతీయ మార్కెట్లో పెరగాలి కదా.మార్కెట్లో కావాల్సినంత లేకపోతే ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి. అది కొన్ని 100ల ఏండ్లనుండి జరుగుతున్న వాస్తవం.

కానీ మన ముఖ్యమంత్రి సారేమో అమెరికాల హర్రీకెన్లు ఒచ్చినయ్ కాబట్టి మనదగ్గర పత్తికి మద్దతు ధర లేదు అంటాడు ..

ఏందో ఈ మహానుభావుల మాటలు ఎవ్వరికీ అర్థం కావు???

దొర, పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్ కి ₹4320, ప్రభుత్వం ఇంకా 50% కల్పి మొత్తం క్వింటాకి ₹6500 ఇస్తామని చెప్పారు. కని మన #గులాభి మార్కెట్ కమిటీ చైర్మన్లు అటు అధికారులు, ఇటు దళారులతో కుమ్మక్కై క్వింటాకీ ₹1500-₹4000 కంటే ఎక్కువ ఇస్తలేరు. ఈ ఘోరాలను తట్టుకోలేక, కడుపు మండి మార్కెట్ యార్డ్ లో జరంత లొల్లి చేస్తే వాళ్ళ ఆవేదనని సాటి రైతుగా అర్థం చెస్కోని దళారుల ఆగడాలు అరిక్కట్టాల్సింది పోయి పోయినేడు సిగ్గులేకుండా బేడిలేసి ఆ రైతుల మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని బెదిరింపులకు దిగితిరి. ఏ మార్కెట్లో చూడు అదే గొడవ.ఇయ్యాల కూడా గద్వాల్ మార్కెట్లో అందరూ కుమ్మక్కై పల్లి రైతులకు సగం ధర కూడా ఇవ్వకుంటే వాళ్ళు మార్కెట్ యార్డ్ మీద దాడి చేసిర్రు.నీకు అలవాటే కదా వాళ్ళమీద కూడా ఏదో దేశద్రోహం కేసువెట్టి లోపల నూకు. రైతు మార్కెట్లో ఉన్నప్పుడు మార్కెట్ కష్టాలు పట్టించుకోక 24 గంటలు కరెంటు ఇస్తున్నాం మాది రైతు ప్రభుత్వం అని అన్నీ బజార్లో వదిలేసి చెప్పవడ్తిరి…

గతంలో ఇంత బాధ్యతారాహిత్యాన్ని ఏ ప్రభుత్వం లో చూళ్ళేదు??????

అమెరికా లో హర్రీకెన్లు అక్కడి పంటకు నష్టం కలిగించడం వల్ల అంతర్జాతీయ పత్తి వ్యాపారులు భారతదేశం వైపు చూస్తున్నారని #REUTERS అనే సంస్థ రాసిన కథనం మీ కోసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *