మోడిగారి పుట్టిన కులం, పెళ్ళి, చదువు, చేసిన వృత్తి అన్ని అస్పష్ట అంశాలే.

పెట్టుడు BC

ఒక్కో ఎన్నికకు ఒక రూపం ,ఒక నినాదం.సర్ధార్ పటేల్ వాడకం ముగిసింది ఇప్పుడు అంబేద్కర్ వారసత్వం కోసం ఆరాటం.

అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టటం వలనే పేద,నిమ్న వర్గానికి చెందిన నేను ప్రధాని స్థాయికి ఎదిగాను-అన్ని నిన్న మోడిగారు చెప్పుకున్నారు.

మోడిగారి పుట్టిన కులం,పెళ్ళి,చదువు,చేసిన వృత్తి అన్ని అస్పష్ట అంశాలే.

మోడి కులం మీద ఇప్పటికి స్పష్టత లేదు.మోడి Modh-Ghanchi కులానికి చెందిన వారని కొందరు, కాదు “Teli” కులస్తుడని మరికొందరు వాదిస్తారు.మోడి ఈ రెండిటిలో కులానికి చెందిన వారైనా ఆయన పుట్టిన 1950లోనో ఆయన చదువుకునే వయస్సులోనో ఆ రెండు కులాలు OBC కులాలు కావు.

1994 జూలైలో అంటే మోడిగారికి 44 సంవత్సరాల వయస్సులో గుజరాత్ చివరి కాంగ్రేస్ ముఖ్యమంత్రి చబిల్ దాస్ మొహత Modh-Ghanchi కులాన్ని OBC కులాల జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించారు.

వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్న 2000 సంవత్సరంలో Modh-Ghanchi,Teli రెండు కులాలను కేంద్ర OBC కేటగిరిలొ గుర్తించింది.

మరి మోడిగారు ఎప్పుడు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వాడుకున్నారొ?పోని ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికల్లొ BC reserved seatలో పోటిచేశారా అంటే అది లేదు.

పెట్టుడు BC మోడి,హిందుయిజం గురించి మాట్లాడే “జైన్” మతస్థుడు అమిత్ షా ఇద్దరు ఎన్నికల కోసం చేస్తున్న ప్రచారాలతో BJP,RSS మూల సిద్దాంతం రిజర్వేషన్లకు అనుకూలం అన్న భ్రమకల్పించటానికి ఆతృత పడుతున్నట్లుంది. వి.పి సింగ్ హయాంలో మండల్ కమీషనుకు వ్యతిరేకంగా BJP చేసిన పోరాటం దేశం ఏలా మర్చిపోతుంది.

అంబేద్కర్ పేరులొ B.Rను B.”రాంజి”,అంబేద్కర్ అని రాసో, ఆయన విగ్రహాలకు కాషాయ రంగు వేసే అంబేద్కరును సొంతం చేసుకోలేరు. దళితుల మీద దాడులు ఏలాగు ఆపలేకపోతున్నారు కనీసం ఆయన విగ్రహలు మీవాళ్ళు కూల్చకుండ చూడండి.

Siva Racharla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *