రిజర్వేషన్ల పేరుతో కెసీఆర్ చేస్తున్న మోసాన్ని లెక్కలతో సహా చదవండి

2001 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో ముస్లింల జనాభా — 9.16%
వై ఎస్ .. ముస్లింలందరికి రిజర్వేషన్ ఇస్తా అని వాగ్ధానం చెయ్యలేదు .. కేవలం ముస్లింలల్ల పేద కులాలకే ఇయ్యాలన్నది ఆలోచన .. 5% అని చెప్పిన్రు ..
ముస్లిమ్ముల్లోని బి సి ల లెక్కలు తీయగా వచ్చింది ..82% అంటే మొత్తం జనాభా లో 7.51%
సుప్రీం కోర్ట్ 50% మించొద్దు అనగా .. 4% ఇచ్చిన్రు

ఎన్నికల్లో కె సి ఆర్ ఇస్తా అన్నది 12%
2014 సమగ్ర కుటుంభ సర్వే ప్రకారం తెలంగాణ లో ముస్లిం ల జనాభా 11.22%
ఒక వేల బి సి ల నిష్పత్తి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇక్కడ ఒకే లాగుంటే .. తెలంగాణలో బి సి ముస్లింల జనాభా 9.2% (11.22 లో 82 శాతం)

తెలంగాణ లో బి సి ల జనాభా 51.08 %
ముస్లిమేతరుల బి సి ల జనాభా – 51.08 % – 9.2 % = 41.88
ముస్లిమేతరుల బి సి లకు ఇచ్చే రిజెర్వేషన్ – 25%

ముస్లిమేతర బి సి లకు ఇచ్చే నిష్పత్తిలోనే .. ముస్లిం బి సి లకు రిజెర్వేషన్ ఇస్తే .. ఎంత ఇయ్యొచ్చు ? 9.2 % * 25 % / 41.88% = 5.5%

బి సి లకు ఇచ్చినట్లే ముస్లింలకు ఇస్తే ఇయ్యాల్సింది 5.5% .. లేదా ఉన్న ముస్లిం బి సి లందరికి ఇస్తే .. ఇయ్యాల్సింది 9.2% .. సరే ఉన్నోల్లందరికి ఇస్తే ఇయ్యాల్సింది 11.22% .. కాని 12% ఇస్తా అని కె సి ఆర్ జనాలని పిచ్చోలను చేసిండు .. చేస్తనే ఉంటడు
—-స్రవంత్ పోరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *