కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి

దళితుడు మొదటి ముఖ్యమంత్రి అంటే “నమ్మినం”.
ఉప ముఖ్యమంత్రిని చేస్తే “సర్దుకున్నాం”.
చెప్పకుండా రాజయ్యను దించితే “ఓర్చుకున్నాం”.

లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీని దున్నుతా అంటే “నమ్మినం”.
సాక్ష్యాలు ఏమీ లేవు కదా అంటే “సర్దుకున్నాం”

అక్రమ కట్టడాలు కూల్చివేస్త అంటే “నమ్మినం”
గా అన్నమయ్య, మన రామన్న మిత్రులే కదా అని “సర్దుకున్నాం”

నయీంతో పాటు తన డైరీకి కూడా గోరీ కడితే “సర్దుకున్నాం”

అవినీతి జరిగితే కొడుకుని గూడ వదలను అంటే “నమ్మినం”
మియాపూర్ స్కాంలో అయితే గాయన బిడ్డ లేదు కదా అని “సర్దుకున్నాం”

తెలంగాణ తెచ్చుకున్నది కడుక్కుని తాగటానికి కాదు అంటే “నమ్మినం”
విలాస భవనాలు, వాస్తులు, యాగాలు.. విశ్వనగరం కొరకే అని “సర్దుకున్నాం”

రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటే “నమ్మినం”
మల్లన్నసాగర్లో అందరూ రాజులే అని “సర్దుకున్నాం”

కోదండరాం సార్ ఎంత ముద్దుగున్నడూ అంటే “నమ్మినం”

రామోజీకి ఉన్న విజన్ లేక కాళ్ళకు అడ్డుపడుతుండు అని “సర్దుకున్నాం”

కానీ

ప్రజల గొంతుక అయి మాట్లాడుచున్న కోదండరాం సార్ ను పదేపదే అరెస్టుల పేరుతో అగౌరవ పరిస్తే “ఊరుకోం”

నాయిని నర్సింహారెడ్డిని టీవీ చానల్ చర్చలో కొట్టిన పట్నం మహేందర్ రెడ్డి…

ఖమ్మంలో తెలంగాణ వాదాన్ని లేకుండా చేసిన తుమ్మల నాగేశ్వరరావు…

హైదరాబాద్ లో కేసీఆర్ ను అడుగు పెట్టకుండా చూస్తానని చెప్పిన తలసాని శ్రీనివాస యాదవ్…

ఉపఎన్నికలో తెలంగాణ వాదం లేదని చెప్పేందుకు ఎన్నికల బరిలోకి దిగిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి…

వీళ్ళంతా రాష్ట్రం వచ్చిన తరువాత మంత్రులు అయ్యారు.

తెలంగాణ వాదులపై రాళ్ళ వర్షం కురిపించిన కొండా సురేఖ….

న్యాయవాదులను ఫుట్ బాల్ ఆడిన తీగల కృష్ణారెడ్డి…

మెదక్ లో విద్యార్థులను చితకబాదిన మైనంపల్లి హన్మంతరావు,

నిజామాబాద్ లో జగన్ వాదం వినిపించిన బాజిరెడ్డి గోవర్ధన్,

వీరంతా శాసనసభ్యులూ ఆయ్యారు.

డి.శ్రీనివాస్ ఉప ఎన్నికలలో ఓడిపోతే తను బలిదానం అవుతానని ఇషాంత్ రెడ్డి డి.శ్రీనివాస్ ఓడిపోగానే బలయ్యారు… డి.శ్రీనివాస్ మాత్రం రాజ్యసభ సభ్యులయ్యారు.

వీరంతా కరుడుగట్టిన తెలంగాణ వాదులు ఆయ్యారు.

ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలక భూమిక పోషించి “సకల జనుల” అందరితో సమ్మె చేయించి హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ప్రజలతో “మిలియన్ మార్చ్” చేయించి తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీకి పంపించిన కోదండరాం సార్ అవకాశవాది అయ్యారా….?

నచ్చితే నజరానా…. లేకుంటే జరిమానా నా…..?
ఎంతైనా ఓడలో ఉన్నంత సేపు ఓడ మల్లన్న
లేదంటే బోడ మల్లన్న ఇదీ మీ నైజం

తెలంగాణ వాదులారా ఇకనైనా మేల్కొందాం మల్ల… లేకుంటే నియంతృత్వ, నిరంకుశ రాజులు రాజ్యమేలుతరు…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *