‘ప్రాణహిత’ సమాధిపై వంచించే ‘వర్ధా’ నాటకం

ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా కేసీఆర్‌ గతంలో నిర్మిస్తానని హామీయి చ్చిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని రద్దుచేసి, ”వార్దానదిపై”కి మార్చి సమగ్రసర్వే నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధంచేసే బాధ్య తను వ్యాప్‌కోస్‌కు కట్టబెట్టారు. ప్రాణహిత-గోదావరి సంపూర్ణ గ్రావిటీ కాలువను రద్దుచేసి, వార్ధానదిపైకి మార్చడం తెలంగాణకు ద్రోహం చేయడమే. ఎనలేని మేలుచేసే ప్రాణహిత148 మీ, మైలారం 138 మీ, గోదావరి (సుందిళ్ల 132 మీ)లకు అనుసంధానం చేసే గ్రావిటీ ప్రాజెక్టు రద్దు తెలంగాణ, ఆదిలాబాద్‌కు అన్యాయమే.
కమీషన్ల కోసం కాళేశ్వరానికి మార్చివేసి 3 బ్యారే జీలతో గోదావరిలో ఎల్లంపల్లికి ఎదురు ఎత్తిపోస్తున్నా రు. గ్రావిటీని సమాదిచేసి, భారీబడ్జెట్‌తో సుస్థిరత కొరవడి కాస్ట్‌-బెన్ఫిట్‌ రేషియోలో కాళేశ్వరం గల్లంతైం ది. ప్రాణహిత జాతీయహోదా పోయింది. కళల ప్రాజె క్టు కాళేశ్వరానికి జాతీయహోదా రాలేదు. పోలవరానికి జాతీయ హోదా దక్కి 90 శాతం డబ్బు ఆదా అయ్యింది. కేసీఆర్‌ ప్రాణహిత చారిత్రక 148 మీ|| ఒప్పందాన్ని, ప్రాజెక్టును రద్దుచేసి చారిత్రక తప్పిదం చేశారు. 4 మీ తగ్గించడం చారిత్రకం కాదు, చారిత్రక ద్రోహం, తెలంగాణను తాకట్టుపెట్టడం వంటిది.
తుమ్మిడిహెట్టి నిర్మాణానికి 1918 కోట్ల వ్యయం, 107 గేట్లు. వార్ధాబ్యారేజీకి 700 కోట్లు, గేట్లు 36. ఇంత ఖర్చెందుకు? ఇన్ని గేట్లెందుకనే? సరికొత్త వాద న. పసలేని డొల్లవాదన. ప్రాణహిత ప్రాజెక్టు ఆదిలా బాద్‌కు నీళ్లివ్వడం కోసం మాత్రమే నిర్మించలేదు. తెల ంగాణకు సాగు, తాగు, పరిశ్రమలకు నీళ్లందించడం ప్రధాన ఉద్దేశం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మొత్తంలో కానీ, నేటి కాళేశ్వరం భారీ ఎత్తిపోతల మొత్తంలో, ని ర్మాణ ఖర్చు తప్ప శాశ్వతంగా పైసాఖర్చు లేకుండా సంపూర్ణ గ్రావిటీతో ఒకనది నుండి మరోనదికి భారీ నీరు తరలించడం తెలంగాణలో ఎక్కడా సాధ్యం కానే కాదు. ప్రాణహిత గోదావరి మధ్యే సాధ్యం. కేసీఆర్‌ రద్దు చేసిన ప్రాణహిత ప్రాజెక్టు, తెలంగాణకు మేలుచే సే ఆగ్రావిటీ ఒక్కటే కావడం ముఖ్యఅంశం. ఎల్లం పెల్లికి రోజుకు 3 టీఎంసీలు తరలించవచ్చు. ప్రాణ హిత ప్రాజెక్టుతో పాటు దాని కాలువ మొత్తం ఖర్చు కేవలం రూ.5 వేల కోట్లు. నేెటికీ ఆమోదించని కేసీఆర్‌ రీ-డిజైనింగ్‌ ప్రకారం ప్రాణహిత ఖర్చు 6,100 కోట్లు. పొదుపు పేరిట ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ అకస్మాత్తుగా నాలుగున్నరేండ్లు పుళ్లెత్తుపని చేయకుం డా ప్రాణహితను రద్దుచేసి వార్ధాకు మార్చడంలో పారదర్శకత నిజాయితీలేదు.
ప్రాణహిత పైసా ఖర్చులేని అతి చౌకైన సంపూర్ణ గ్రావిటీ-కాళేశ్వరం లక్షకోట్లకు చేరువవుతున్న తెలంగా ణ గుదిబండ, వినాశనకారి. 90 వేల కోట్లకు చేరిన కమీషన్ల ప్రాజెక్టు కాళేశ్వరంతో కానీ, వార్దాబ్యారేజీతో కానీ తెలంగాణ అంతటికి వీలైనంత ఖర్చు తగ్గించి సు స్థిరంగా నీరందించే కలలు ఎన్నటికీి నెరవేరవు. తెలం గాణకు నీరందించే ఖర్చు కాళేశ్వరంతో అనూహ్యంగా పెరిగి రాష్ట్రానికి అది ఒక గుదిబండగా మారితే ”వార్ధా బ్యారేజీ”తో తెలంగాణంతటికి ప్రాణహితలో లభ్యమ య్యే నీటి మొత్తాన్ని తరలించడం సాధ్యం కానేకాదు. ప్రాణహిత వైన్‌గంగ వార్దా అనే రెండు నదుల సమ్మేళ నం. అంటే ప్రాణహితలో రెండు నదుల సంగమం వల్ల నీటి లభ్యత భారీగా వుంటే వార్ధా ఒక్కటే కావడం వల్ల ప్రాణహితలో లభ్యమయ్యేంత నీరు లభించదు. వైన్‌గంగతో పోలిస్తే వార్ధానది చిన్నది. ప్రాణహితలో భారీ వరదనీరు బీభత్సంగా ప్రవహిస్తుంది. భారీనీరు గ్రావిటీలో లభ్యమయ్యే ప్రధాన కారణాల వల్లనే వైన్‌ వార్ధాల సంగమమైన ప్రాణహితపై నిర్ణయమైనది.

వార్ధాపైనే కాదు, ప్రాణహిత, పెనుగంగ, గోదా వరి నదులపై మహారాష్ట్ర వలె ఎన్ని షేక్‌హాండ్‌ బారేజీ ల నిర్మాణానికైనా ఎవ్వరు అడ్డుకాదు, వ్యతిరేకం కాదు. కానీ ప్రాణహిత గ్రావిటీ ప్రాజెక్టు రద్దుచేయడమే దు ర్మార్గం. మహారాష్ట్రలా ‘షేక్‌హాండ్‌ బ్యారేజీలంటే, ఒక బ్యారేజీ నీళ్లు మరో బ్యారేజీ గేట్లను తన్ని, నది పొడవం తా ఓ నిండు కుండలా ఉండడం. నదులున్న చోట ప్రాజెక్టులు నిర్మించాలి కాని మల్లన్నసాగర్‌లా నీరు లేని చోట కాదు. తుమ్మిడిహెట్టి అత్యుత్తమమని డీపీఆర్‌ వైఎస్‌ఆర్‌ హయాంలో వ్యాప్‌కోస్‌ ఇచ్చింది. ప్రాణహిత లో పడ్తల్‌లేదని కేసీఆర్‌ ఖరీదైన కమిషన్ల కాళేశ్వరం భారీ రివర్స్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు కొరకు, మరో డీపీఆర్‌ ఇవ్వమని వ్యాప్‌కోస్‌ను ఆదేశించగానే తుమ్మిడిహెట్టి శుద్ధ తప్పని తన నివేదికను తనే బుట్టదాకలు చేసి, ప్రాజెక్టు నిర్మా ణానికి (మేడిగడ్డే) కాళేశ్వరమే చాలా కరెక్టని మరో డీపీ ఆర్‌ ఇచ్చింది. ఇలా 5 వేల కోట్లతో గోదావరికి అనుసంధానమయ్యే ప్రాణహిత గ్రావిటీ ప్రాజెక్టును పాతిపెట్టి లక్షకోట్లకు చేరువవుతున్న కమీషన్ల కాళేశ్వరం వచ్చింది. నేడు మళ్లీ కేసీఆర్‌ కుంటి ఖర్చుసాకుల పేర తూర్పు ఆదిలాబాద్‌కు కూడా ఆ ప్రాణహిత పనికిరాదని వార్ధానదిపైకి బ్యారేజీ మార్చి డీపీఆర్‌ వ్యాప్‌కోస్‌ను ఇవ్వమంటే, ఆ సర్వేకు శరవేగం గా సిద్ధమైంది. ప్రాణహిత ప్రాజెక్టు నేపధ్యం లోనే 2008 నుంచి 2018 వరకు 3 డీపీఆర్‌ లు ఇచ్చింది వ్యాప్‌కోస్‌. కోట్ల కాసులు, కార్పొరేట్‌ కాంట్రాక్టర్లు అది óకార పెద్దల కోసం వ్యాప్‌కోస్‌ తన నివేదికలను తనే మార్చుతూ భారీ కార్పొరేట్‌ కాసుల వ్యభిచారం చేస్తుంది. గ్రావిటీ ప్రాజెక్టులను గాలికొదిలి, భారీబడ్జెట్‌ ఎత్తిపోతలనే వ్యాప్‌కోస్‌ కార్పొరేట్‌ కాంట్రాక్టర్ల కోసం తలకెత్తుకుంది. వ్యాప్‌కోస్‌ వల్ల ప్రాణహిత తూర్పు ఆది లాబాద్‌ జిల్లాల్లో రూ.1700 కోట్ల పనులు జరిగాయి. ప్రాణహిత రద్దుతో వేలకోట్ల ప్రజాధనం వృథాగా మా రుతుంది. పోలవరంలో కాలువలను ఉపయోగించుకొ ని ”పట్టిసీమ” ఎత్తిపోతలతో కృష్ణా(బ్యారేజీ)నదికి ఏటా వంద టీఎంసీలకు పైగా ఎత్తిపోసి, 15 లక్షల ఎకరాలకు పైగా కోస్తా, ఆంధ్రలో సాగునీరు అందిస్తుం ది. ప్రాణహిత గ్రావిటీ కాలువను ఉపయోగించుకొని గోదావరికి భారీ నీరు తరలించవచ్చు. పోలవరం కాలువలను ‘పట్టిసీమ’ ఎత్తిపోతలతో వాడుకొంటుం టే, ఎత్తిపోతలు అసలేలేని ప్రాణహిత-మైలారం- గోదావరి సంపూర్ణ గ్రావిటీ కాలువ తెలంగాణకు ఒక అద్భుతం కాదా! సుస్థిర గ్రావిటీని పెడచెవినపెట్టి, తెలంగాణ ఖజానాను కాంట్రాక్టర్లకు అర్పించే లక్షలకోట్ల భారీ ఎత్తిపోతలను కేసీఆర్‌ ఎందుకు తలకెత్తుకున్నారు. ప్రాణహిత ప్రాణప్రదమైన ప్రాణజల తెలంగాణ మేలు కేసీఆర్‌కు పట్టదా?

– నైనాల గోవర్థన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *