తెలంగాణ కవుల, సాహితి,సాహిత్యవేత్తల చేవ సచ్చిందా??

ఉద్యమంలో ఉరకలెత్తిన మీ కలాలు ఇప్పుడు అధికార పంచన ఎందుకు చేరినయ్?? అప్పటి ఆరాటం,పోరాటం అంతా స్వయం ఉపాధి కరువయ్యిందనేనా??

అందుకేనా మీ రాతలతో తెలంగాణ యువతని రెచ్చగొట్టి వందల ప్రాణాలను పొట్టనబెట్టుకుని ఆ కుటుంభాలకు, తెలంగాణ సమాజమే కడుపుకోత మిగిల్చింది??

పరాయి పాలన నుంచి విముక్తి అయ్యి సొంత పాలన రాంగనే మీ బాధ్యత తిరిపోయిందా??

మనోని దోపిడిలో మీకు వాటాలు రాంగనే నవారంధ్రాలు మూసుకుపోయాయా??

ప్రాంతేతరుడు మోసం చేస్తే తరుముదాం,
ప్రాంతంవాడే మోసం చేస్తే పాతిపెడదాం అన్న కాళోజీ మాటలు మర్శిపోయిర్రా??

వాడు పిలవంగానే ఎగేసుకొని కాళేశ్వరం పోయిర్రు, అహో అద్భుతం అని సిగ్గులేకుండా పొగుడుతుర్రు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను ప్రశ్నించడానికి మీ నాలుకలు చచ్చుబడిపోయాయా??
మీ కలాలకు గత్తరోచ్చిందా?

కాంక్రీటు రికార్డులు,బాహుబలి కట్టడాలు తప్ప వాటి వెనకాల జరుగుతున్న దోపిడిని ప్రశ్నించరా??

ప్రాణహిత-చేవెళ్ల కాళేశ్వరం అయ్యింది ఆయకట్టు విస్తీర్ణం మారలేదు, వ్యయం మాత్రం #మూడింతలయ్యింది.
పెరిగిన వ్యయంలో మీ వాటాలొచ్చినందుకే మీ నోళ్లు చచ్చుబడిపోయాయా??

2.5లక్షల ఎకరాల భూములను నిజాం కన్నా నిరంకుశంగా గుంజుకుంటే, ఆ భూనిర్వాసితుల ఆర్తనాదాలు మీ కలాలను కదిలించలేక పోయాయా?? నిద్రావస్థలో ఉండి వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదనుకున్నారా??

లక్షలకోట్ల కాంట్రాక్టులు ఆంధ్రోనికే ధారాదత్తం చేస్తుంటే అస్తిత్వం, ఆత్మగౌరవం అని మొత్తుకున్నా మీ నోళ్ళకు జెట్టలువుట్టినయా??

కాళేశ్వరం పోయిన బస్సులను
ఓ గోలివాడ
ఓ మిడ్మానేరు
ఓ రంగనాయక సాగర్
ఓ కొండపోచమ్మ సాగర్
ఓ మల్లన్నసాగర్
ఓ చెర్లగూడెం ప్రాజెక్టు
ఓ సీతారామ ప్రాజెక్టు…
భూనిర్వాసితుల ప్రాంతాలకు పోయి వాళ్ళు పడుతున్న కష్టాలను వ్యవసాయ క్షేత్రంలో పదుల సంఖ్యలో భూబెంగా తో సచ్చిన శవాల మీద పడుకున్న దొరకి చెప్పాలనే యావసచ్చిందా??

ఇప్పటికైనా మారి బాధితుల బాధలు రాస్తారో, దొరకు ఊడిగం చేస్తారో తేల్సుకొర్రి లేకపోతే తెలంగాణలో ఒకప్పుడు కవులు,కళాకారులు ఉండేవారట అని మన భవిష్యత్తు చెప్పుకునే తలవంపు తేకుర్రి!!

జై ఆత్మగౌరవ, అస్థిత్వ తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *