గౌడ్ లకు బిచ్చమ్ వేసిన కేసీఆర్

నిన్నటి KCR అసెంబ్లీ ప్రకటన ద్వారా గౌడన్నలకు ఓరిగింది ఏమి లేదు…
ఏ విధంగా అంటే..
నాలుగేళ్ళు గా తెల్వని సంక్షేమం ఎలక్షన్లు రాగానే గుర్తు వచ్చిందా…??

#పన్నురద్దు: ఆక్టోబర్ కొత్త పాలసి ప్రకారం ఇప్పటికే 90% పన్ను వసూల్ చేశారు..
అంటే ఈ సంవత్సరం గీత కార్మికునికి ఎటువంటి లబ్ది చేకూరది…

#ఫించన్లు: వృద్దాప్య ఫింఛన్లు తీసుకుంటున్న కుటుంబంలో గీత కార్మిక ఫించన్లు ఇవ్వటం లేదు.
దీనివల్ల ఏమి లేదు…

#భవనం:ఐదు ఎకరాల భూమి, ఐదు కోట్ల భవనంతో లక్షలాది కుటుంబాలకు ఏ విధమైన ప్రయోజనం కలగదు..

దాదాపు నాలుగేళ్ళుగా గౌడన్నల గురించి పట్టించుకోని ఈ సర్కార్ ఇయ్యాల్ల మొసలి కన్నీరు కారుస్తుంది…

నిజంగా గౌడన్నల గురించి ఆలోచించే ప్రభుత్వమే అయితే..
ఈ డిమాండ్లను పరిష్కరించాలి….

1) 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి..

2) తాటి చెట్లు ఎక్కే ప్రతి గీత కార్మికునికి చెట్టు ఎక్కే మిషన్ ఇవ్వాలి..

3) వృద్దాప్య ఫింఛన్లతో సంబంధం లేకుండా 50 ఏళ్ళు దాటిన TFT మరియు లైసన్ ఉన్నవారికి మరియు లైసన్ లేకుండా గీత వృత్తిపై ఆధార పడిన అందరికి ఫించను ఇయ్యాలి…

4) ప్రతి గ్రామానికి ఐదు ఎకరాల భూమిని ఈత , తాటి వనాలు పెంచటానికి ప్రభుత్వమే కొనియ్యాలి…

5) కల్లు దుకాణాలపై ఎక్సైజ్ దాడులు బంద్ చేపించి
బెల్ట్ షాప్ లను పూర్తిగా రద్దు చేయాలి…

6) చెట్టుపైనుండి పడి గాయపడిన మరియు చనిపోయిన కార్మికునికి 20 రోజుల్లో 5 లక్షల నష్ట పరిహారం అందించాలి…

7) గీత కార్మికుల పిల్లలకు ఉన్నత చదువు మరియు నిరుద్యోగ యువతక కార్పోరేషన్ కింద లోన్స్ ఇవ్వాలి, ఉపాధి చూపాలి …

KCR ఇచ్చిన నిన్నటి ప్రకటనకే మురిసిపోకుండా

ఈ డిమాండ్లు అన్ని నేరివేరిస్తే నిజంగా గౌడన్నల జీవితాల్లో మార్పు వస్తుందని ఆశిస్తూ……

మీ శ్రేయోభిలాషి:

#బండారు రమేష్ గౌడ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *