భూమి ప్రక్షాళన కాదు దళితుల శిక్షాళన లాగా ఉంది // 39 గుంటల కోసం దళితుల హత్య

మిత్రులారా, రోజురోజుకీ దళితులపై హింస, హత్యలు పెరిగిపోతున్నాయి. ఇవాళ కిష్టారావ్ పల్లె పొలం లో తండ్రి కొడుకుల్ని దారుణంగా నరికి చంపినరు. భూమి ప్రక్షాళన కాదు దళితుల శిక్షాళన లాగా ఉంది.

రసమయి బాలకిషన్ నియోజకవర్గం కందికట్కూర్లో దళితుల పరిస్ధితి ఇది దళితులని దారుణంగా నరికి చంపినరు …

కిష్టారావ్ పల్లె, కంది కట్కూరు, ఇల్లంతకుంట మండలం. కరీంనగర్ లో… 39 గుంటల భూమి కోసం దళిత కుటుంభం మీద దాడి…

విషయానికి వస్తే పొద్దున్నే ఆ దళిత కుటుంబం పొలంకి పోయినారు. తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు. ఉదయం 5.30 గంటలకు ట్రాక్టర్ లో వస్తుంటే డీజల్ అయిపోవడంతో కుటుంబంలోని చిన్న కొడుకు అనిల్ డీజల్ ను తీసుకు రావడానికి పోయిండు…

అంతలో ముదిరాజ్ కుటుంబ సభ్యులు తల్లి తో సహా కత్తులు,కొడవళ్ళతో, గొడ్డలతో దాడి చేసినారు… అంతకంటే ముందే వారు తెచ్చుకున్న కారంపొడితో అనిల్ తల్లి ఐన ఎల్లవ్వ మరియు , శేఖర్ మీద చల్లింది. దానితో వెనువెంటనే మామిడ్ల దేవయ్య, స్వామి, వెంకటేష్ లు ఆ దళిత కుటుంబం మీద అతి దారుణంగా దాడి చేసినారు…

39 గుంటలు అధికారుల వైఫల్యం వల్ల, కులం కారణంగా వారు చంపబడ్డారు. అనిల్ ఇపుడు షాక్ లో ఉండి మాట్లాడలేని పరిస్థితి.. తల్లి ఎల్లవ్వ తృటి లో తప్పించుకుంది. రెండు శవాలు పోస్ట్ మార్టం లో ఉన్నాయి..అయితే పోలీసులకి ఆ కారంపొడి చల్లిన మహిళ దొరకలేదు… ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. కానీ హత్యాయుధాలు దొరకలేదు కాబట్టి అరెస్ట్ లేదు..తప్పెవరిది?

పొద్దుటనుంచి చేసిన ధర్నాలో ఒక డిమాండ్ శవాలను అప్పగించాలని, గ్రామ మధ్యలో అంబెడ్కర్ విగ్రహం దగ్గర టెంట్ వేసుకోవడం. ఇప్పుడే ఎండీవో వచ్చి అంగీకరించి రెండు శవ పేటికలను ఏర్పాటు చేసి వెళ్లినరు.

భూముల పేరు మీద దళితుల హననం జరుగుతుంది. ఇప్పుడు దళితులని సీ ఎం లని చేయక పోయినా ఫరవాలేదు, 3 ఎకరాలు ఇవ్వకున్న ఫరవాలేదు. గౌరవంగా బ్రతకనిస్తే చాలు, మాములుగా తిరగనిస్తే చాలు. అయితే దళితులకు, పీడితులకి భరోసా అవసరం. మనం ఒక్క రోజు మనది కాదనుకుంటే ఒక మార్పు కి దోహద పడతాం.
మేము ఉసా, లక్హ్మాన్, మారవాడి సుదర్శన్ , అభినవ్, డి ఏస్.యూ ఇతర దళిత సంఘాలు ఉన్నాయి. బంధువులు, గ్రామస్తులు టెంట్ వేసినరు.

మీరంతా సిద్దిపేట నుండి రావొచ్చు, కరీంనగర్ నుండి రావొచ్చు. పది గంటలకి ఇక్కడ ఉండేటట్టు రాగలరు.
బహుజన ప్రతిఘటన వేదిక.

సుజాత సూరేపల్లి 9849468281
ఉసా -9849346707,
మార్వాడి సుదర్శన్ 9533286120
బండారి లక్ష్మయ్య 9963548687
అభినవ్ 9849393414

Post By : Sujatha Surepally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *