Bhaagamathie Review // Anushka Shetty

#భాగమతి

ఒక నిజాయతీ ఆఫీసర్ రాజకీయాల్లోని అవినీతి నాయకుల ఆటను అడ్డుకునే కథనం తో తీసిన సినిమా ఈ భాగవతి.

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఈశ్వరప్రసాద్ వద్ద చీఫ్ సెక్రటరీగా సివిల్స్‌లో టాపర్ అయిన చెంచల నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్. ప్రజలకు మంచి చేస్తూ ప్రజలకు అండగా వుంటుంది.

విదేశాల్లో ఉన్నత చదువు చదివి జన్మభూమి మీద ప్రేమతో తన ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటాడు శక్తి. ఓ రోజు ప్రాణధార ప్రాజెక్టు నిర్వాసితుల పక్షాన నిరసన తెలపడానికి వచ్చిన శక్తిని చూసి అతని మంచి తనం నచ్చి ప్రేమించడం మొదలుపెడుతుంది. ఈశ్వర ప్రసాద్ పన్నిన కుట్రలో తను ప్రేమించిన శక్తిని చంపి జైలుకు వెళుతుంది చెంచల. మచ్చలేని వ్యక్తిగా చెలామణీ అవుతున్న ఈశ్వర ప్రసాద్‌ పై సీబీఐ విచారణ లో భాగంగా జైలు నుండి చెంచలను సీబీఐ ఎంక్వైరీ పేరుతో భాగమతి బంగ్లాకు తరలిస్తారు సీఐ సంపత్( శక్తి అన్న) సీబీఐ అధికారిని వైష్ణవీ నటరాజన్. అక్కడ ఏం జరిగింది? చెంచలను సీబీఐ ఎందుకు విచారించింది? ప్రేమించిన తన ప్రియుడినే(ప్రియుడా, భర్తనా కొంచెం కన్ఫ్యూజ్.. ఓ సీన్ లో దండలు మార్చుకుంటారు) తను ఎందుకు చంపింది?. ప్రాణధార ప్రాజెక్ట్ వెనకున్న అసలు కథేంటి?అసలు ఈశ్వర ప్రసాద్ పై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

చంచల(అనుష్క)
శక్తి(ఉన్ని ముకుందన్)
ఈశ్వర ప్రసాద్(జయరాజ్)

Content: Public Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *